బిగ్ బ్రేకింగ్ : కరోనాపై వైసీపీ అసాధారణ విజయం.!

Sunday, May 24th, 2020, 10:06:36 AM IST

మన దేశంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది అని చెప్పాలి. రికార్డు స్థాయి శాంపిల్స్ ను తీసుకొని పరీక్షిస్తూ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఏపీ నిలిచింది.

ఇదిలా ఉండగా ఇప్పుడు వైసీపీ సర్కార్ మరో మైలు రాయిని అందుకున్నట్టు తెలుస్తుంది.శాంపిల్స్ సేకరణ మరియు పరీక్షలు పెరుగుతుంటే మరోపక్క కేసులు కూడా పెరుగుతాయి కదా అలా పెరిగిన వాటిలో కూడా అత్యధికంగా కోలుకున్న రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉన్నట్టుగా వైసీపీ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.

కరోనా నుంచి కోలుకున్న వారి సగటు జాతీయంగా 40 శాతం లోపలే ఉండగా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కోలుకున్న వారి సగటు 68 శాతం ఉందని తెలిపారు. ఇది కరోనా పై అసాధారణ విజయమే అని విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.