బ్రేకింగ్ న్యూస్: అమ్మ ఒడి తర్వాత అతి పెద్ద కార్యక్రమం ఇదే…పేదలకు పండగే ఇక!

Friday, January 24th, 2020, 06:28:06 PM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరొక సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. పేదలకు ఈ ఉగాది పండుగ నాటికి ఇళ్ల పట్టాలను అందజేసే దిశగా చర్యలు చేపట్టాలని ముక్యఖ్త్మంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం లో అన్నారు. అయితే అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం అత్యంత ప్రాధాన్యమైనది అని తెలియజేసారు. అయితే ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని అని వ్యాఖ్యానించారు. అమ్మఒడి పథకం తర్వాత వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న అతి పెద్ద కార్యక్రమం ఇదేనని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ లో విద్య, వైద్యం, పేదల సంక్షేమం పట్ల ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారని చెప్పాలి. పేదలకు అమ్మఒడి పథకం పరిచయం చేసిన కొద్దీ రోజులకే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టింది అని చెప్పాలి. పేదల కోసం, వారి ప్రయోజనాల కోసం వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో పెద్ద కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ ఎపుడు శ్రీకారం చుడతారనేది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.