తలతోక లేని స్టేట్మెంట్స్ ఇస్తున్న వైసీపీ..ఇదేనా రాజన్న రాజ్యం

Sunday, August 25th, 2019, 06:04:37 PM IST

నాలుగైదు రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి గురించి మాట్లాడుతూ రాజధాని మార్పుపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని, వరదలు వస్తే అమరావతి మునిగిపోయే పరిస్థితి ఉందని దానిపై అలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. అయితే దానిపై అన్ని వర్గాల నుండి విమర్శలు రావటంతో డిఫెన్స్ చేసుకోలేకపోయిన వైసీపీ వెంటనే దాని ఖండిస్తూ, తమ అసలు ఉద్దేశ్యం వేరని , దానిని కొందరు కావాలనే వక్రీకరించి చెప్పారంటూ మాట్లాడసాగారు.

మళ్ళీ ఈ రోజు విజయనగరంలో బొత్స మాట్లాడుతూ తాను మంత్రిగా ఉండి మాట్లాడిన మాటకి కట్టుబడి ఉన్నానని, అమరావతి విషయంలో తప్పకుండా అలోచించి ఒక నిర్ణయం తీసుకుంటామని మరోసారి చెప్పుకొచ్చాడు. ఇక్కడ గమనిస్తే కేవలం మూడు రోజుల్లోనే ఒకే విషయంపై రెండు మూడు సార్లు మాట మార్చి చెపుతున్నారు. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. దీని వలన ప్రజల భయాందోళనలకు గురైయే అవకాశాలు ఉన్నాయి.

విశ్వసనీయతే మా పాలనకు కొలమానమని చెప్పుకునే వైసీపీ నేతల యొక్క విశ్వసనీయత ఇదేనా..? ఇప్పుడు చెప్పిన మాట రేపొద్దున ఉండదు. ఇలాంటి నాయకులను నమ్మేదెలా అనే మాటలు వినవస్తున్నాయి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్నవాళ్లు ఒక మాట మాట్లాడే ముందు అన్ని అలోచించి మాట్లాడితే బాగుటుంది, ఏదో సమయానికి తగ్గట్లు మాట్లాడితే అది విశ్వసనీయత అనిపించుకోదు.