బిగ్ బ్రేకింగ్ : వాలంటీర్ల పోస్టుల్లానే మరో దారుణానికి తెరలేపిన జగన్ సర్కార్?

Thursday, August 22nd, 2019, 02:07:07 PM IST

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే నిరుద్యోగ యువత కోసం గ్రామ వాలంటీర్లు అని చెప్పి నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటన ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ ఉద్యోగాల విషయంలోనే జగన్ సర్కార్ చాలా పారదర్శకంగా ఎంపిక చేస్తాము ఎలాంటి తప్పులకు పాల్పడము లాంటి పెద్ద పెద్ద పదాలనే వాడారు.కానీ ఇక్కడే సీన్ కట్ చేస్తే జగన్ చెప్పిన మాటలకు పూర్తి విరుద్ధంగా ఎవరికీ నచ్చిన వారికి వైసీపీ ఎమ్మెల్యేలు వారి వారి అనుచరులకు సంబంధీలకు ముఖ్యంగా వైసీపీ అభిమానులకే ఈ ఉద్యోగాలను ఇచ్చుకున్నారు.

ఎలాంటి రాత పరీక్షలు లేకపోయేసరికి వీరి ఇష్టారాజ్యంగా నచ్చిన వారికి వారి కను సన్నల్లోనే ఈ ఉద్యోగ నియామకాలు జరిగాయి.ఇది పూర్తయ్యిపోయింది.ఇప్పుడు మళ్ళీ ఇదే తరహాలో మరో ప్రభుత్వ ఉద్యోగాలను కూడా వారి వైసీపీ అభిమానులకే కేటాయించుకోబోతున్నట్టు తెలుస్తుంది.తాజాగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి జూనియర్ లైన్ మెన్ పోస్టులు పడ్డాయి.ఈ ఉద్యోగాలకు కూడా ఎలాంటి రాత పరీక్షలు లేవని తెలుస్తుంది.ఇంకేముంది ఈ ఉద్యోగాలు కూడా వైసీపీ అభిమానులు వారి పార్టీ కార్యకర్తలకే కేటాయించుకునే ప్రక్రియలు జరుగుతున్నట్టు సమాచారం.ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మొత్తానికి జగన్ చెప్పినట్టు మన ప్లేట్ లో మన బిర్యానీ కథ ఇదేనేమో అనిపిస్తుంది.