టీడీపీ సోషల్ మీడియాకి చుక్కలు చూపించిన వైసీపీ..దెబ్బ అదుర్స్

Tuesday, October 8th, 2019, 09:19:08 AM IST

ఒకప్పుడు పత్రికలు ప్రభావం రాజకీయాల మీద ఎక్కువగా ఉండేది. అందులో ఎలాంటి ప్రచారం జరుగుతుందో జనాలు దానినే ఎక్కువగా నమ్మేవాళ్ళు, ఆ రోజుల్లో సాయంత్రం పత్రికలు కూడా వచ్చేవి. అంతలా వాటికీ ఆదరణ ఉండేది. ఆ తర్వాత న్యూస్ చానెల్స్ రావటంతో వాటికీ ఆదరణ పెరిగింది. ఆ రోజు జరుగుతున్నా వాటిని వెంటనే వీడియో రూపంలో అందించటంతో వాటికీ ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది, సోషల్ మీడియా రావటంతో దీనికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాతో కనెక్ట్ అయ్యి ఉండటంతో క్షణాల వ్యవధిలో న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. అందుకే రాజకీయ పార్టీలు అన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ప్రచారం చేస్తున్నాయి.

అయితే ఇందులో కూడా ఎవరికీ వాళ్ళు అనుకూలంగా,మరో పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టటం జరుగుతుంది. అవి ఒక్కోసారి హద్దులు దాటి పోతున్నాయి. దీనితో తమ మీద వ్యతిరేక ప్రచారం చేసేవాళ్ళని అధికారంలో ఉన్న పార్టీ తొక్కేయటానికి చూస్తుంది. ఇక ఆంధ్రాలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ సోషల్ మీడియా విషయం యమా హుషారుగా ఉంటుంది. మొన్నటి ఎన్నికల సమయంలో వైసీపీ విజయం వెనుక సోషల్ మీడియా పాత్ర చాలా ఉంది. దాని ఎఫెక్ట్ ఎంత అనేది వైసీపీ వాళ్ళకి బాగా తెలుసు. అందుకే దానికోసం ఒక ప్రత్యేకమైన క్యాబినెట్ హోదా కలిగిన పోస్ట్ క్రియేట్ చేసి సోషల్ మీడియా చీఫ్ ని నియమించారు .

వాళ్ళ ప్రధాన బాధ్యత ఏమిటంటే సోషల్ మీడియాలో వైసీపీకి, జగన్ కి వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు వచ్చిన కానీ వాటిని వెంటనే తీసేయటం, అవి పోస్ట్ అయిన అకౌంట్స్ బ్లాక్ చేపించటం, అవసరం అయితే వాటిని పోస్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయటం, దీని కోసం స్పెషల్ ఫోర్స్ ని కూడా వైసీపీ ప్రభుత్వం ఉపయోగిస్తుంది. రీసెంట్ గా టీడీపీకి అనుకూలంగా పేస్ బుక్ లో యాక్టీవ్ గా ఉండే దాదాపు 2 వేల అకౌంట్స్ ని వైసీపీ ప్రభుత్వము బ్లాక్ చేపించింది. దీనితో టీడీపీ నేతలకు ఏమి చేయాలో అర్ధం కాక తలలు పట్టుకున్నారు. ఇష్టం వచ్చినట్లు పోస్టులు చేస్తే ఊరుకునేది లేదని మరోసారి వైసీపీ ప్రభుత్వం అర్ధం అయ్యేలా చేసింది.