అవి అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు…వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Wednesday, April 1st, 2020, 11:20:19 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నిత్యావసర సరుకుల షాపుల్లో ధరల పట్టిక ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్నా అధిక ధరకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదు చేసేందుకు ధరల పట్టికలోనే టోల్ ఫ్రీ నంబర్ నీ ఉంచారు. అయితే వైసీపీ చేసిన వ్యాఖ్యల పై నెటిజన్లు స్పందిస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరు పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే పలు చోట్ల ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అంతేకాక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ప్రెస్ మీట్ అనంతరం మీడియా ప్రతినిధులతో ముచటించండి అంటూ వ్యాఖ్యానించారు.