నియోజ‌క‌వ‌ర్గాల పెంపులో తేదేపాను క‌లుపుకుని..!!

Friday, November 25th, 2016, 09:32:59 PM IST

YSRCP
ఏపీలో నియోజ‌క‌వ‌ర్గాల పెంపు జ‌రిగితే త‌మ‌కు లాభిస్తుంద‌ని వైకాపా భావిస్తోందా? అంటే అవున‌నే విశ్లేషిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాలు పెరిగితే త‌మ పార్టీకి లాభించే అంశాలున్నాయ‌ని వైకాపా అధినేత భావించ‌డం వ‌ల్ల‌నే ఈ విష‌యంలో తేదేపా అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుతో మాట్లాడాల‌ని త‌మ నేత‌ల‌కు జ‌గ‌న్ ఆదేశించారు. అందులో భాగంగానే వైకాపా నేత‌లు బాబును క‌లిసి నియోజ‌క‌వ‌ర్గాల పెంపు విష‌యంలో ప‌చ్చ చొక్కాల‌కు అండ‌గా నిలుస్తామ‌ని తెలిపారు.

అలాగే వైకాపా అధికారంలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలకు నిధులు స‌క్ర‌మంగా అంద‌కుండా తేదేపా అడ్డేయ‌వ‌ద్ద‌ని ఈ సంద‌ర్భంగా వైకాపా నేత‌లు బాబును కోరారు. ప‌లు ర‌కాల ప్ర‌జాస‌మ‌స్య‌ల్ని ప్ర‌స్థావించిన వైసీపీ నేత‌లు.. న‌వ్యాంధ్ర రాజ‌ధాని కార‌ణంగా భూములు కోల్పోతున్న నిర్వాసితుల‌కు స‌రైన ప‌రిహారం అంద‌డం లేద‌ని వెల్ల‌డించారు. వారికి న్యాయం చేయాల‌ని కోరారు. ఈ భేటీలో చంద్ర‌బాబు నుంచి త‌మ‌కు ఏమాత్రం సానుకూల‌త వ్య‌క్తం కాలేద‌ని విచారం వ్య‌క్తం చేశారు. మ‌రి నియోజ‌క‌వ‌ర్గాల వ‌ర‌కూ ఓకే కానీ… మిగ‌తా విష‌యాల్లో తేదేపాకు నాట్ ఓకే అన్న‌మాట‌!