కరోనా నుంచి ఇంటికి వచ్చేసిన వైసీపీ కీలక నేత..!

Friday, July 31st, 2020, 07:56:53 AM IST

ఏపీలో కరోనా వైరస్ గత కొన్ని రోజుల నుంచి భారీ ఎత్తున కేసులు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ప్రభుత్వం చెప్తున్నా పనులకు కానీ గ్రౌండ్ లో జరుగుతున్న పనులకు గాని ఏమాత్రం పొంతన కనబడటం లేకపోవడంతో చాలా మంది కరోనా పేషంట్ల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి అని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఈ కరోనా దెబ్బకి వైసీపీ కీలక నేతలు కూడా ఏపీలో వైద్యాన్ని కాదని హైదరాబాద్ వెళ్లిపోయారు. అలా కరోనా సోకిన వైసీపీ కీలక నేతల్లో అంబటి రాంబాబు కూడా ఒకరు. గత పది రోజుల కితం అంబటికి కరోనా పాజిటివ్ రావడం తో ఆయన కూడా హైదరాబాద్ వైద్యాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకు కరోనా తగ్గిపోయినట్టుగా కన్ఫర్మ్ చేసి ట్వీట్ చేశారు.

“మీ అందరి ఆశీసుల వల్ల పది రోజులు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుని,నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యి ఈ రోజు ఇంటికి వచ్చాను. మరొక్క వారం రోజులు ఇంట్లోనే లో ఉండమని వైద్యుల సలహా.నేను కోలుకోవాలని కోరుకున్న ప్రతిఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.” అంటూ ట్వీట్ చేసి తనకి నయం అయ్యినట్టు తెలిపారు.