మొత్తానికి వైసీపీ “ప్రత్యేకహోదా” అనే అంశాన్ని చంపేసారు.!?

Wednesday, September 11th, 2019, 03:09:17 PM IST

గతంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ మరియు నవ్యాంధ్రప్రదేశ్ గా అప్పటి కేంద్ర ప్రభుత్వం విడగొట్టినపుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంకు అన్ని సదుపాయాలు కలిగించేలా ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తామని ఏకంగా 10 కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ అధినేత మోడీ వెంకయ్య నాయుడులే మాట ఇచ్చి తప్పారు.

సరే వారికి ముందు అంతా వత్తాసు పలికి అనేక మాటలు మార్చి చివరకు తాము కానీ ప్రత్యేకహోదా కోసం మాట్లాడకపోతే మొదటికే మోసం వస్తుందని టీడీపీ అధిష్టానం మాట్లాడిందే తప్ప వారికి నిజంగానే హోదాపై చిత్తశుద్ధి ఉన్నట్టుగా ఎక్కడా వ్యవహరించలేదు.కానీ మొదట్లో అయితే మాత్రం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మాత్రం హోదా పై పోరాటం చేసారు.కానీ ఈయన కూడా మెల్లగా మోడీపై ఎందుకనో స్వరాన్ని తగ్గించడం మొదలు పెట్టి ఈసారి ఏకంగా 22 మంది ఎంపీలను గెలుచుకున్న సరే సార్ సార్ అని ప్రాధేయపడతాం అని చెప్తూ షాకిచ్చారు.

మళ్ళీ ఒకటి రెండు సార్లు మోడీని కలిసినప్పుడు హోదా కోసం అడుగుతున్నామని అంటున్నారు తప్ప ఎక్కడా కూడా ఏపీ హక్కు అయినటువంటి హోదాను తెప్పిస్తాను అని మాత్రం జగన్ చెప్పలేకపోతున్నారు.ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వైసీపీ టీడీపీల మధ్య గొడవలే చూసుకుంటున్నారు తప్ప అసలు ప్రత్యేక హోదా అనే అంశాన్నే పక్కన పెట్టేసారు.అసలు జగన్ నిజంగా హోదా తీసుకువస్తారా లేక తన కేసుల వల్ల లాలూచి పడి హోదా అనే అంశాన్నే చంపేసారా అని ఇతర పార్టీల వారు ప్రశ్నిస్తున్నారు.