హాట్ టాపిక్: అడ్డంగా దొరికిన వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు

Wednesday, January 15th, 2020, 01:40:00 AM IST

అమరావతిలో ఆందోళనలు చేపట్టిన రైతుల్ని వైసీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఎగతాళి చేసారు కొందరు. ప్రతిపక్షాలకు ఎలాంటి జన ప్రవాహ కార్యక్రమాలకు హాజరైనా వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు అంటూ విమర్శలు చేస్తుంది. అయితే ఈ సారి వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. వైసీపీ కార్యకర్తలకు ఒక వ్యక్తి డబ్బు పంచుతున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో కి పెయిడ్ ఆర్టిస్టులకు జీతాలు ఇస్తున్న వైసీపీ ప్రభుత్వం అంటూ కాప్షన్ పెట్టి వుంది.

అమరావతి రాజధాని విషయం లో కొన్ని రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులు అని అనడం తో కొందరు ఆగ్రహానికి, వేదనకి లోనయ్యారు. మరి ఈ సంఘటన పట్ల వైసీపీ నేతలు ఎలాంటి సమాధానం ఇస్తారో తెలియాలి. కాగా ఈ విషయం ఫై కామెంట్ చేయడం కూడా జరిగింది. వారే పెయిడ్ ఆర్టిస్టులు అని అంటారు, కానీ మనీ తీసుకొనేదే వీరు అని, పూర్తిగా సిగ్గు వదిలేశారని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.