బిగ్ న్యూస్: టీడీపీ “భూస్థాపిత అధ్యక్షుడు” చంద్రబాబు–కొడాలి నాని

Tuesday, December 3rd, 2019, 04:24:04 PM IST

తెలుగుదేశం పార్టీ భవితవ్యం ఫై వైసీపీ నేత కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణాలో భూస్థాపితం చేసిన చంద్రబాబు, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అలానే చేసి తీరుతారని కొడాలి నాని అన్నారు. తెలంగాణాలో టీడీపీ భూస్థాపితానికి కారణం చంద్రబాబు, నారా లోకేష్ అని అన్నారు. ఓటుకి నోటు కేసులో కూడా దొరకడం తో పూర్తిగా టీడీపీ కి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. అయితే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ గారని, భూస్థాపిత అధ్యక్షులు చంద్రబాబు అని అన్నారు.

చంద్రబాబు నియోజక వర్గం చంద్రగిరి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కి అధ్యక్షుడిగా ఉండగా టీడీపీ మూడు సార్లు, కాంగ్రెస్ ఒకసారి గెలిచిందని అన్నారు. అయితే చంద్రబాబు టీడీపీ కి అధ్యక్షుడు అయ్యాక, వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ మరియు రెండు సార్లు వైసీపీ గెలిచిందని అన్నారు. అయితే చంద్రబాబు పుట్టి పెరిగిన నియోజక వర్గం ఇదేనని తెలిపారు కొడాలి నాని. అయితే ముఖ్యమంత్రి అయ్యాక కూడా చంద్రబాబు ఒక్కసారి కూడా అక్కడినుండి గెలవలేదని అన్నారు. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రం లో జగన్ మోహన్ రెడ్డి కి ఎలా ఫైట్ ఇస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని.