బ్రేకింగ్: పవన్ కళ్యాణ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన విజయసాయిరెడ్డి

Thursday, November 14th, 2019, 11:13:07 AM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ని తప్పనిసరి చేయడం. అయితే ఈ విషయం లో వైసీపీ ప్రభుత్వం పై ప్రశంసలు, విమర్శలు వస్తూనే వున్నాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇంగ్లీష్ మీడియం కి వ్యతిరేకం గా వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని కూడా ఇంగ్లీష్ లో చదివించండని “నిత్యకల్యాణం” అనడం చూస్తే రెండు లక్షల పుస్తకాలూ చదివింది ఎంత నిజమో తెలిసిపోతుంది. సుప్రభాతం సంస్కృతంలో ఉంటుందని జ్ఞానికి తెలియదు అని పవన్ కళ్యాణ్ ని దుయ్యబట్టారు. అంతేకాకుండా ఎవరైనా బ్రీఫ్ చేస్తే తప్ప దీనిపై ఎలా విమర్శించాలో అంతుబట్టనట్టుంది అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శల పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

అయితే వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పై జనసైనికులు వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకూ ఈ పోస్ట్ పెట్టడానికి మీకు మూడు రోజులు పట్టింది. మీకు ఎవరు బ్రీఫ్ చేసారు అంటూ విజయసాయిరెడ్డి కి చురకలు అంటించారు.