నారా లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి

Saturday, November 9th, 2019, 05:12:57 PM IST

విజయసాయిరెడ్డి ప్రతి పక్షాలు చేస్తున్న ఆరోపణలకు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. నారా లోకేష్ పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేసారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. సచివాలయం, మంగళగిరి, గుంటూరు అనే పేర్లు సరిగా పలకడమే రాణి మాలోకం తెలుగు ఉద్యమకారుడిలా మాట్లాడుతున్నాడు అని విమర్శలు చేసారు. మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చదువుతారు. బడుగు బలహీన వర్గాల వారికీ ఆ చదువులెందుకు అంటున్నాడు అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేసారు. వాళ్ళు గ్రామాలూ దాటి బయటకు రావద్దన్నది టీడీపీ దుర్మార్గపు కోరిక ని విమర్శలు గుప్పించారు.

వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను టీడీపీ సవాళ్లుగా స్వీకరిస్తూ అధికార పార్టీ పై విమర్శలు గట్టిగానే చేస్తుంది. అయితే నెటిజన్లు మాత్రం జగన్ నిర్ణయం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు జగన్ స్పీచ్ ని పెట్టి జగన్ మాట్లాడిన తీరుని వివరించే ప్రయత్నం చేస్తున్నారు.