చంద్రబాబుకి కుర్చీ మీద వ్యామోహం ఇంకా పోలేదనుకుంటా – వైసీపీ నేత

Sunday, July 7th, 2019, 03:01:44 AM IST

రాష్ట్ర వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య మాట్లాడుతూ… టీడీపీ అధినేత చంద్రబాబు పై కొన్ని సంచలనమైన వాఖ్యాలు చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నం లేకుండా ఉండగలరు కానీ, అధికారం లేకుండా ఉండలేరంటూ విమర్శించారు. అంతేకాకుండా టీడీపీ కార్యకర్తలపై దాడులు అంటూ చంద్రబాబు కావాలనే కుట్రపూరితంగా రాజకీయాలకు తెరతీస్తూ, అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. ఇకపోతే కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. ” కేంద్రం ఏడా పెడా పన్నులు పెంచింది. కేంద్రం ఆదాయాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఈ బడ్జెట్. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. రాష్ట్రాల ప్రయోజనాలపై కేంద్రం దృష్టి పెట్టలేదు. పెట్రోల్ ధరలు పెంచితే దాని ప్రభావం వివిధ రంగాలపై పడుతుంది. పూర్తి మెజారిటీ వచ్చిందనే దర్పముతో రాష్ట్రాలు అవసరం లేదనే విధంగా ప్రధాని నరేంద్రమోదీ వ్యవహరిస్తున్నారు అని వాఖ్యానించారు.

ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కార్పొరేట్ ఆదాయం పెంచేలా ఉంది తప్ప, సామాన్యుల ఆదాయం కాదు. పన్నుల విధింపులలో పారదర్శకత లేదు. జీఎస్‌టీ ఏకీకృతం కాలేదు.. ముడి సరుకు, అంతిమ ఉత్పత్తి పైనా పన్నులు వేస్తున్నారు. అనవసరమైన వాటిమీద ద్రుష్టి పెట్టిన వారు ఏపీ పై ఎందుకు సరైన ఆలోచనలు చేయడం లేదని అంటున్నారు. ఇప్పటికి కూడా ఏపీకి అన్యాయం చేయాలనే చూస్తున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు.