పాపం చంద్రబాబు పరిస్థితి ఏంటి ఇలా తయారైంది.. వైసీపీ నేత దారుణ ఆరోపణలు

Wednesday, September 18th, 2019, 12:41:06 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న చర్యల పై వైసీపీ నేతలు విమర్శలు చేయడం సహజమే. ఎన్నికలలో ఓటమి తర్వాత చంద్రబాబు తీరు మారిందని చెప్పాలి. చంద్రబాబు చేసే చర్యలు సర్కస్ లా ఉన్నాయని పరోక్షంగా ఎద్దేవా చేసారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. చంద్రబాబు టీడీపీ ని ఒక సర్కస్ ట్రూప్ లా మార్చాడు అని అన్నారు.

చంద్రబాబు ని విమర్శిస్తూ ఒక చిన్నపాటి విశ్లేషణని ప్రజలముందు ఉంచారు. చంద్రబాబు ఎదో ఒక చోట టెంట్ వేస్తారు. జనాలు వస్తారు, వచ్చిన వారంతా తమకు ఓటు వేసిన వారేనని చంద్రబాబు హుషారై పోతారు అని అనుకుంటారు అంటూ ఎద్దేవా చేసారు. సర్కస్ చూసిన వాళ్ళు షో పూర్తవగ్గానే చప్పట్లు కొట్టి ఇంటికెళ్తారు. ఇంటికెళ్ళాక ఇవేమి గుర్తుండవు అని చంద్రబాబు పై దారుణంగా వ్యాఖ్యలు చేసారు. విమర్శలు కామన్ అయినా చంద్రబాబు చేసే ప్రతి పని లో ఇలా వేలు పెట్టడం దారుణమనే చెప్పాలి.

image.png