భూకుంభకోణం లో చంద్రబాబే ప్రధాన నిందితుడు… వైసీపీ నేత సంచలన వాఖ్యలు

Saturday, October 19th, 2019, 03:00:04 AM IST

శుక్రవారం నాడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటిని మీడియా సమావేశానికి హాజరైనటువంటి అనకాపల్లి ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి చాలా దారుణంగా జరిగిందని, విశాఖ కేంద్రంగా భారీ భూకుంభకోణం జరిగిందని, దీనికి అంతటికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు అని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. ఈమేరకు వైసీపీ ప్రభుత్వం భూ కుంభకోణంపై కఠినమైన విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను నియమించింది అని వెల్లడించారు.

కాగా ఈ విషయంలో అసలే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, కేవలం మూడు నెలల్లో దోషులని పట్టుకొని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇకపోతే 2014 హుదూద్‌ తుపాను సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో దాదాపుగా 20 వేళా ఎకరాల భూములు ట్యాపరింగ్ జరిగాయని యకం ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపిస్తున్నారు. ఇకపోతే గత ప్రభుత్వ అధికార అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడ్డవారందరిని కూడా శిక్షిస్తామని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు.