టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు – వైసీపీ నేత సంచలనం

Thursday, June 13th, 2019, 10:50:21 PM IST

ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9 లో ఏర్పాటు చేసినటువంటి చర్చ కార్యక్రమానికి హాజరైనటువంటి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు… ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన టీడీపీ ని విమర్శిస్తూ సంచలన వాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ కి సంబందించిన ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ నేతలతో టచ్ లో వున్నారని, వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు తనతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, వారందరు కూడా టీడీపీ ని వదిలి వైసీపీ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ అన్నారు. ప్రస్తుతానికి ఏపీలో టీడీపీ కి ఇక భవిష్యత్ లేదని, ఇలా ఎన్ని జరిగిన కూడా చంద్రబాబు అసలే మారారని, అందుకే టీడీపీ నేతలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అంతేకాకుండా వైసీపీ లో చేరాలనుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఎలాంటి పదవులు ఆశించకుండా వస్తున్నార్నయి, భవిష్యత్ లో తంటాలు పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరారని చెప్పారు.

కాగా తమ పార్టీలోకి రావాలనుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పార్టీ మారాలి అనుకుంటున్న నేతలు వస్తే తమకి ఎలాంటి ఇబ్బంది లేదని, ఒకవేళ వస్తే మాత్రం వారు తమ పార్టీ కి మరియు తమ పదవికి అధికారికంగా రాజీనామా చేసి రావాలని చెప్పారు. ఆలా వస్తేనే తమ పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. అయితే జగన్ కొత్తగా వేస్తున్న ప్రణాళికలో మాత్రం మళ్ళీ ఉప ఎన్నికలు జరిపి మరీ తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. కానీ వారిని చేర్చుకుంటే మాత్రం గతంలో టీడీపీ పార్టీ ఎదుర్కొన్న సమస్యలే మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకని జగన్ అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడని సమాచారం.