చంద్రబాబు ని టార్గెట్ చేసిన వైసీపీ నేత!

Thursday, October 17th, 2019, 11:32:38 AM IST

తెలుగు దేశం పార్టీ నేతలు జగన్ రైతు భరోసా పథకం పై విమర్శలు చేస్తూనే వున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులకు అన్యాయం జరిగిందని, అవకతవకలు జరిగాయని అనడం హాస్యాస్పదం అని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే జగన్ పై వస్తున్న విమర్శలకు వైసీపీ నేత విజయసాయి రెడ్డి సెకను గ్యాప్ ఇవ్వకుండా సోషల్ మీడియా ద్వారా, మీడియా ముందు చంద్రబాబు పై విమర్శలు గుప్పిస్తూనే వున్నారు. తాజాగా విజయసాయి చేసిన వ్యాఖ్యలు టీడీపీ పరిస్థితీ ఏంటి అన్నట్లుగా వున్నాయి.

చంద్రబాబు జగన్ ని ప్రశ్నిస్తూ చాలానే అన్నారు. ఎవరిచ్చారు మీకీ అధికారం అని అంటుంటే ప్రజలు నవ్వుతున్నారని అన్నారు విజయసాయిరెడ్డి. ఎక్కడికెళ్ళైనా, మీడియా ముందు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్తలను ఆహ్లాద పరచడానికి అని అన్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నించరాదనే కనీస స్పృహ కూడా లేదని చంద్రబాబు పై విమర్శలు చేసారు. జగన్ పై ఏ మాత్రం చిన్న విమర్శ చేసిన చంద్రబాబు ని టార్గట్ చేయడం లో ముందుంటారు విజయసాయిరెడ్డి.