పవన్ కి ఇంగిత జ్ఞానం కూడా లేదు–వైసీపీ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు!

Thursday, February 13th, 2020, 08:49:19 AM IST

పవన్ కళ్యాణ్ కర్నూల్ లో చేపట్టిన ర్యాలీ ఫై వైసీపీ పార్టీ ఘలక్ ఇచ్చింది. అసలు ఆడవారిపై మాట్లాడే హక్కు పవన్ కి ఉందా అని వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 2017 లో బాలిక ఫై అత్యాచారం జరిగితే ఇపుడు న్యాయం చేయాలనీ పవన్ అడుగుతుండటం విడ్డురం అని అన్నారు. చంద్రబాబు సూచన మేరకు పవన్ వచ్చారా? అని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే సంఘటన జరిగిందని గుర్తు చేసారు. ఘటన ఫై విచారణ జరపాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరారని ఎమ్మెల్యే గుర్తు చేసారు. వారి విజ్ఞప్తి మేరకు విచారణ జరుపుతున్నామని, విచారణ కోసం ఒక ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించిందని అన్నారు.

అయితే మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి జగన్ దిశ చట్టం తీసుకొచ్చారని తెలిపారు. అయితే అత్యాచారానికి గురైనటువంటి బాధితురాలి పేరు చెప్పకూడదనే ఇంగిత జ్ఞానం పవన్ కి లేదని విమర్శించారు. బాధిత బాలిక కుటుంబానికి న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో డీజీపీ ని కలిశామని, పవన్ రోడ్డు మీదకి రాకముందే విచారణకు ఆదేశించాలని డీజీపీ ని కోరినట్లు తెలిపారు. అభివృద్ధి ని వ్యతిరేకించే పవన్ కర్నూల్ లో బాధిత బాలిక పేరు చెప్పి రాయలసీమ లో అడుగు పెట్టారని విమర్శించారు. అయితే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ గురించి ఏం మాట్లాడారో అందరికి తెలుసనీ, దిశ చట్టం వచ్చాక రేణు దేశాయ్ కి ఇలా జరిగి ఉంటె పవన్ కే చుట్టుకొనేదని ఘాటు విమర్శలు చేసారు.

అయితే కర్నూల్ వైసీపీ పార్లమెంట్ అధ్యక్షుడు బివై రామయ్య మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసేందుకు చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని అన్నారు. సిబిఐ కి అప్పగించిన కేసులో కొత్తగా పవన్ చేస్తున్న డిమాండ్ ఎవరికీ అర్ధం కావడం లేదని విమర్శలు చేసారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ మనుగడ కోసమే బాలిక అంశాన్ని వాడుకోవాలని చూస్తున్నారని ఘాటు విమర్శలు గుప్పించారు.