ఎమ్మెల్సీ పదవులకు నామినేషన్ వేసిన వైసీపీ నేతలు

Wednesday, August 14th, 2019, 01:29:05 PM IST

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు వైసీపీ అభ్యర్థులు… వైసీపీ నేతలు ఇక్బాల్, చల్లా రామకృష్ణ రెడ్డి, మంత్రి మోపిదేవి వెంకటరమణలు నామినేషన్లు వేశారు. కాగా ఈసందర్భంగా మాట్లాడిన వైసీపీ నేత ఇక్బాల్… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. ఏపీలో అధికారంలోక్ వచ్చాక జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నాడని కొనియాడారు. కాగా ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు పై కొన్ని సంచలనమైన వాఖ్యకు చేశారు. చంద్రబాబు లాగా పది సార్లు చెప్పించుకునే అలవాటు జగన్మోహన్ రెడ్డి కి లేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకోసం పరితపించే వ్యక్తి అని తెలిపారు.

ఏపీ మంత్రి మోపిదేవి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓడిపోయిన వారికి కూడా పదవులు అప్పగించే గొప్ప బాధ్యత కేవలం జగన్మోహన్ రెడ్డి కి సొంతం అని అన్నారు. జగన్ తాను తీసుకున్న నిర్ణయం ప్రకారం అందరికి, అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేశారని చెప్పారు. అంతేకాకుండా పదవులకి 50శాతం రిజర్వేషన్లు పాటిస్తూ… ఎమ్మెల్సీ కోటాలో 3 వర్గాల వారికి చాలా గొప్పతనం అని మంత్రి మోపిదేవి కొనియాడారు. కాగా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులు బుధవారం ఉదయం వెలగపూడి లోని అసెంబ్లీ కార్యదర్శి, శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి. బాలకృష్ణ మాచార్యులు కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేసారు.