వైసీపీ నేతలకు టార్గెట్ పవన్ కళ్యాణ్ మాత్రమే?

Monday, December 16th, 2019, 01:50:43 PM IST

పవన్ కళ్యాణ్ పరిస్థితి చాల దారుణంగా తయారైందని చెప్పాలి. ప్రజల కోసం, ప్రశ్నించడం కోసం రాజకీయాలలోకి అడుగుపెట్టి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసారు. అయితే పార్టీ కి కొండంత బలంగా వున్న రాజు రవితేజ పార్టీ ని వీడడం తో పవన్ కళ్యాణ్ ఇపుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు అనే దాని ఫై సర్వత్రా చర్చలు జరుగున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కంటే కూడా పవన్ పై నే వైసీపీ నేతల గురి ఉందని చెప్పాలి.

జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ చాల విమర్శలు చేసారు. అయితే వైసీపీ నేతలు మాత్రం పవన్ విమర్శలకు ఘాటుగానే బదులిస్తున్నారు. టీడీపీ కంటే కూడా జనసేన ఎక్కువగా జగన్ ని టార్గెట్ చేస్తుండటంతో వైసీపీ నేతలు ఇక పవన్ తీరుని ఎండగడుతున్నారు. అయితే టీడీపీ-జనసేన గతంలో కలిసి పని చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అదే విషయాన్నీ రాజు రవితేజ్ ప్రస్తావించడం, వైసీపీ నేతలకు పెద్ద అవకాశం గా మారింది. ఈ సుడి నుండి పవన్ కళ్యాణ్ ఎలా బయటపడతారో చూడాలి.