బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబును మట్టుపెట్టేందుకు ఈ కుతంత్రమా..ఆ బాక్స్ లో ఏముంది?

Friday, August 16th, 2019, 01:26:34 PM IST

తాజాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.మంగళగిరిలోని చంద్రబాబు నివాసం దగ్గర అనుమానాస్పదంగా ఒక డ్రోన్ సంచరించడం దుమారాన్ని రేపింది.ఇప్పుడు అసలు అది ఎందుకు వచ్చింది ఎవరు పంపారు ఏ ఉద్దేశంతో పంపారు అనే అనేక కోణాల్లో తెలుగు తమ్ముళ్ల మదిలో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.ఇక ఇలాంటి షాకింగ్ ఘటన చోటు చేసుకుందంటే రాజకీయ పరంగా శత్రుత్వం ఉన్నటువంటి వైసీపీ పైకే అన్ని అనుమానాలు వెళ్తాయి.ఇందులో భాగంగానే ఇప్పుడు టీడీపీ అధిష్టానం తమ అనుమానాన్ని వైసీపీ పై వ్యక్తం చేస్తుంది.

ఇందుకు సంబంధించి వారి సోషల్ మీడియాలో అధికార వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.”వైసీపీ ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? మాజీ ముఖ్యమంత్రిని మట్టుపెట్టే కుతంత్రమా?” అని ట్వీట్ పెట్టి సంచలనం రేపారు.అంతే కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా ఆ డ్రోన్ ను ఆపరేట్ చేసిన ఆగంతకులను కూడా పట్టుకున్నారు.అలాగే లోకేష్ కూడా మరో సంచలన ట్వీట్ పెట్టారు.”వై ఎస్ జగన్ గారూ! అమెరికాకు వెళ్తూ చంద్రబాబుగారికి ప్రాణహాని కలిగించమని మీ వాళ్ళకు ప్లాన్ ఇచ్చి వెళ్ళారా? జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై అనుమతి లేకుండా డ్రోన్లు ఎందుకు ఎగిరాయి? డ్రోన్ తో ఉన్న బాక్సులో ఏముంది? వాళ్ళు మీ పేరెందుకు చెప్పారు?” అని ప్రశ్నించారు.మరి ఇది నిజంగానే చంద్రబాబును మట్టు పెట్టేందుకు చేసిన కుట్ర?లేదా మరేమన్న కోణం ఉన్నదా అన్నది తెలియాల్సి ఉంది.ఈ వార్త ఇంకా తెలీని టీడీపీ అభిమానుల రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి.