బాబు విషయంలో సంచలన విషయం బయటపెట్టిన వైసీపీ మీడియా!?

Monday, June 10th, 2019, 01:26:49 PM IST

ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరో సంచలన వార్త ప్రకంపనలు రేపుతోంది అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.గడిచిన ఎన్నికల్లో వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.కానీ 2014 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు గెలిచారు,అప్పటి నుంచి ఈసారి వచ్చిన ఎన్నికల వరకు చంద్రబాబును మరియు ఆయన పార్టీను మన మీడియా వారు ఏస్థాయిలో లేపుకుంటూ వచ్చారో ఇప్పుడు కొత్తగా చెప్పనవసరం లేదు.చంద్రబాబును మరియు అతని పార్టీని వారు ఎందుకు ఈ స్థాయిలో ఎలివేట్ చేస్తూ ప్రతీ చిన్న ప్రెస్ మీట్ ను కూడా లైవ్ ప్రసారాల్లో చూపించి రాష్ట్రంలో టీడీపీ మాత్రమే ఉంది అనేలా ఒక రకమైన కోణాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గట్టిగానే చేసారు.

అయితే దీనికి సంబందించి వైసీపీ సోషల్ మీడియా విభాగం వారు సంచలన విషయాన్ని ఇప్పుడు బయట పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.దాదాపు గడచిన ఐదేళ్లలో చంద్రబాబు తన అను”కుల” మీడియా కోసం ఏకంగా 700 కోట్లకు పైగా ఖర్చు పెట్టారట.ఈ డబ్బు అంతా ఎక్కడిది?ప్రజా ధనమే కదా వారి జేబుల్లోనుంచి తీయకుండా వారి స్వార్ధ రాజాకీయాల కోసం ఇలా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఇప్పుడు ఈ వార్త రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.మరి దీనిపై జగన్ ఏమన్నా ప్రక్షళన చేసే నిర్ణయం ఏమన్నా తీసుకుంటారా లేదా చూడాలి.