జగన్ ఏరి కోరి చేసిన మంత్రిపై మామూలు సెటైర్లు పడట్లేదుగా!

Wednesday, September 18th, 2019, 10:10:25 AM IST

ఏపీలోని ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ ఆ రేంజ్ టెన్షన్ వచ్చింది మాత్రం జగన్ తన మంత్రి వర్గంలో ఎవరెవరికి స్థానాన్ని కల్పిస్తారో అన్న విషయంలో అని చెప్పడంలో ఎలాంటి సందేహాం లేదు.చివరి వరకు జగన్ ఎలాంటి లీకులు కానీ వార్తలు కానీ బయటకు పొక్కనివ్వకుండా తాను అనుకున్న రోజునే మొత్తం 25మంది జాబితాను విడుదల చేసి ఆశ్చర్య పరిచారు.అయితే అందులో ఖచ్చితంగా వీరి పేరు ఉంటుంది అని అనుకున్న వారి పేరులే లేకపోవడం ఆశ్చర్యకరం.

అయితే ఎన్నికలు కొంత కాలం ముందే పార్టీలో చేరిన నేతలకు ఎమ్మెల్యేలు ఇచ్చి మంత్రులను కూడా చేసారు.అలా ఏరి కోరి టీడీపీ నుంచి వచ్చిన అవంతి శ్రీనివాస్ కు కూడా జగన్ మంత్రి పదవి అప్పగించారు.అయితే ఇప్పుడు ఆయనపై సోషల్ మీడియాలో సెటైర్లు మాములుగా పడడం లేదు.ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ ఆయన కొన్ని అద్భుతమైన వ్యాఖ్యలు చేసారు.”బోటు మీద మరియు హెలికాప్టర్ లలో వెళ్ళేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోవాలి” అని నోరు జారేసి మీడియాకు చిక్కారు.

ఇలాంటి వ్యక్తి మన మంత్రులలో ఒకరని ఇలా ఏం మాట్లాడాలో కూడా తెలీని వ్యక్తిని జగన్ ఏరి కోరి మరీ మంత్రిని చేసుకున్నాడని ఒక లెక్కలో ఆడుకుంటున్నారు.అయితే ఎవరైనా మాట్లాడేప్పుడు కొన్ని కొన్ని సార్లు ఇలా నోరు జారడం సహజం.కానీ ఏపీలోని ఉన్న అన్ని పార్టీల అభిమానులు కూడా ఇవే మాటలను పట్టుకొని వేలాడ్డం సమంజసం కాదు.