మీకు పెళ్లిళ్లు ఇష్టం, మాకు ప్రజాసేవ ఇష్టం – మంత్రి నాని సంచలన వాఖ్యలు

Tuesday, November 12th, 2019, 07:50:19 PM IST

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా ఇసుక రవాణా విషయంలో అటు ప్రభుత్వానికి, ఇటు విపక్షాలకు మధ్యన ఒకరకమైన మాటల యుద్దాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈమేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైనటువంటి వైసీపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీఎం జగన్ పై చేసిన వాఖ్యలను మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ కి అసలు రాజకీయాలు తెలియవని, కేవలం చంద్రబాబు దర్శకత్వంలో పవన్ నటిస్తున్నాడని విమర్శించారు.

కాగా రాష్ట్రంలో వరదల కారణంగా ఇసుక రవాణా జరగడం లేదని కనీస విషయాన్నీ తెలుసుకోలేని వీరు ప్రజాసేవకు అనర్హులని మంత్రి వాఖ్యానించారు. విపక్షాలు అన్ని కూడా నిరంతరం సీఎం జగన్ పై ఇలా విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, కానీ సీఎం జగన్ చేసిన మంచి అసలు వీరికి కనిపించడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ని పవన్ నాయుడు అని సంబోధిస్తూ, తీవ్రమైన విమర్శలు చేశారు. కాగా పవన్ కళ్యాణ్ కి వరుస పెళ్లిళ్లు చేసుకోవడం అంటే ఇష్టం, కానీ తమ సీఎం జగన్ కి ప్రజాసేవ చేయడం ఇష్టం అని, అంతేకాకుండా పవన్ కి కుల పిచ్చి బాగా పెరిగిపోయిందని మంత్రి పేర్ని నాని వాఖ్యానించారు. కాగా ఈ మంత్రి వాఖ్యలపై జనసేనాని ఎలా స్పందిస్తారో చూడాలి మరి.