రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని రఘురామ కృష్ణంరాజు కుట్ర చేశారు – అంబటి రాంబాబు

Monday, May 17th, 2021, 08:30:58 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ప్రకారమే నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు డ్రామాలు ఆడుతున్నారు అంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. అయితే రఘురామ కృష్ణంరాజు చేసిన విమర్శలే పనిగా పెట్టుకున్నారు అంటూ అంబటి రాంబాబు టీవీ 5, ఏబీఎన్ ల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీవీ 5 మరియు ఏబీఎన్ లతో కలిసి రఘురామ కృష్ణంరాజు కుట్ర పన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అశాంతిని సృష్టించాలని రఘురామ కృష్ణంరాజు కుట్ర చేశారు అంటూ ఆరోపించారు. అయితే ఆయన అరెస్ట్ పై యెల్లో మీడియా బాధపడుతోంది అని అంబటి రాంబాబు అన్నారు. ఒక ఎంపీ ను పోలిసులు ఎక్కడైనా కొడతారా అంటూ చెప్పుకొచ్చారు. అయితే కులాలను, మతాలను రెచ్చగొట్టే విధంగా రఘురామ కృష్ణంరాజు వ్యవహరించారు అని సంచలన ఆరోపణలు చేశారు. సామాన్యుడైనా, పార్లమెంట్ సభ్యుడైనా చట్టం ముందు సమానమే అంటూ అంబటి రాంబాబు అన్నారు.

అయితే ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ పట్ల ప్రతి పక్ష పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యం లో వైసీపీ నేతలు ధీటుగా సమాధానం ఇస్తున్నారు.