పవన్ వారి గురించి మాట్లాడే నైతిక అర్హత కోల్పోయారు – అంబటి రాంబాబు!

Sunday, June 28th, 2020, 09:27:52 AM IST

తాజాగా బీసీ లకి అన్యాయం చేశారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేస్తూ గత టీడీపీ ప్రభుత్వం పాలన విధానం పై ఎందుకు ప్రశ్నించలేదు అని వ్యాఖ్యానించారు. టీడీపీ మత్తులో ఉన్న జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కాపుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు అని, కోల్పోయారు అని అంబటి రాంబాబు అన్నారు.గత ప్రభుత్వం చంద్రబాబు పాలన లో కాపుల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు. అంతేకాక నేడు జగన్ పాలన లో కాపులకు చేస్తున్న అంశాల పై అంబటి రాంబాబు ప్రస్తావించారు.

కాపు మహిళల కోసం వైయస్సార్ కాపు నేస్తం ప్రవేశ పెట్టారు అని, అందుకొరకు 354 కోట్ల రూపాయల ను లబ్ది దారుల ఖాతాల్లో వేశారు అని వ్యాఖ్యానించారు. కాపుల్లో వెనకబాటు తనాన్ని తొలగించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చాక ఇప్పటి వరకు 4,770 కోట్లు ఖర్చు చేశారు అని వ్యాఖ్యానించారు. ఇంత చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనలో ఏటా వెయ్యి కోట్ల రూపాయలుఇస్తానని ప్రకటించిన చంద్రబాబు అయిదేళ్లలో 1,874.67 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు అని వ్యాఖ్యానించారు.

అయితే కాపులకు వైసీపీ చేసిన మేలు పై శ్వేతపత్రం విడుదల చేయాలి అని పవన్ కళ్యాణ్ అంటున్నారు, చంద్రబాబు అధికారం లో ఉండగా ఎందుకు కోరలేదు అని పవన్ కళ్యాణ్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు.బాబు పాలన లో ముద్రగడ ను అరెస్ట్ చేసి, వారి కుటుంబం ను చిత్ర హింసలకు గురి చేసినపుడు మీడియా ముందుకు వచ్చి తాము అండగా నిలిచాం అని, ఆనాడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి పోయారు అని వ్యాఖ్యానించారు.