చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే – కారణం ఏమై ఉంటుంది…?

Thursday, December 5th, 2019, 05:34:19 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై, తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కాగా గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రజలందరికి కూడా ఒక మంచి మాయాబజార్ చిత్రాన్ని చూపించారని, ఆ పాపం అంత కూడా ఇప్పుడు రివర్స్ లో చంద్రబాబు కి తగులుతుందని ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపించారు. అంతేకాకుండా ఇటీవల చంద్రబాబు రాజధాని పర్యటనలో అక్కడి ప్రజలందరూ ఎలా స్వాగతం పలికారో మనందరికీ కూడా తెలుసనీ, చంద్రబాబు గారి 40 ఏళ్ళ రాజకీయ జీవితం మనందరి కళ్ళముందు కనబడిందని ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపించారు.

కాగా రాష్ట్రంలో రాజధాని నిర్మాణం పేరుతొ రాజధాని రైతులను, కూలీలను చంద్రబాబు దగా చేశారని, చాలా దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. ఇకపోతే చంద్రబాబు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని మళ్ళీ రాజధానిలో ఏర్పాటు చేసుకుంటే ఈ సారి చీపుర్లు పడతాయేమోనని గ్రహించిన చంద్రబాబు విజయవాడలో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఇకపోతే రైతులను కూలీలుగా మార్చిన ఘనత కేవలం చంద్రబాబు సొంతం అని, చంద్రబాబు అమరావతి దొంగ అని వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి వాఖ్యానించారు.