చంద్రబాబు ఎవరి కాళ్ళు పట్టుకున్నా శిక్ష పడటం ఖాయం–వైసీపీ ఎమ్మెల్యే

Friday, February 14th, 2020, 04:18:21 PM IST

చంద్రబాబు ఫై రోజురోజుకీ విమర్శలు పెరిగిపోతున్నాయి. గత పాలనా విధానం ఫై ,రాష్ట్రంలో నెలకొన్న అస్థిరత్వ సమస్యల ఫై చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ నేతలు ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్నీ గుర్తు చేస్తూ పలు వ్యాఖ్యలు చేసారు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్. రాష్ట్రం విడిపోయాక చెట్టు కింద పాలన చేసానని చెప్పుకొనే చంద్రబాబు బండారం బట్ట బయలైందని అన్నారు. కష్టపడుతున్నామని చెప్పి, పాలనలో దోచేశారని సంచలన ఆరోపణలు చేసారు.

అయితే చంద్రబాబు వద్ద పనిచేసినటువంటి సహాయకుడు వద్దే రెండు వేల కోట్లు దొరికితే, బాబు, లోకేష్, వారి అనుచరులు వద్ద ఎన్ని వేల కోట్లు దొరుకుతాయో అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అనిల్ కుమార్ తెలిపారు. చంద్రబాబు తీరు ఫై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అనిల్ కుమార్, చంద్రబాబు జైల్లో ఉంటారనడానికి షెల్ కంపెనీల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఒక కారణమని తెలిపారు.

కాంట్రాక్టులకు నిధులు విడుదల చేసి చంద్రబాబు జేబులు నింపుకున్నారని, పోలవరం కాంట్రాక్టు నుండి బాబు ప్రవేశపెట్టిన అన్ని పథకాల ఫై విచారణ చెప్పటి ప్రజాధనాన్ని కాపాడాలని అనిల్ కుమార్ అన్నారు. అయితే చీకట్లో చంద్రబాబు ఎవరి కాళ్ళు పట్టుకున్నా శిక్ష పడటం ఖాయమని తెలిపారు. చంద్రబాబు ఫై విచారణ చేపడితే లక్షల కోట్ల అవినీతి సొమ్ము బయటపడుతుందని సంచలన వ్యాఖ్యలు చేసారు.