సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించిన వైసీపీ ఎమ్మెల్యే

Monday, April 5th, 2021, 11:35:22 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం మొదలయింది. అయితే ఈ మేరకు అటు అధికార పార్టీ వైసీపీ పూర్తి మెజారిటీ సాధించుకునేందుకు సిద్దం అవుతుంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరు ఎమ్మెల్యే వాసు బాబు ప్రచారం లో పాల్గొన్నారు. ఎంపీటీసీ అభ్యర్ధులు గంటా శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ అభ్యర్ధి జయ లక్ష్మీ తరపున ఎమ్మెల్యే ప్రచారం చేశారు. అయితే ప్రచారం లో భాగం గా వైసీపీ ఎమ్మెల్యే సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. అయితే ఫ్లో లో సైకిల్ గుర్తుకు ఓటేయాలని అన్న ఎమ్మెల్యే పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అంతేకాక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల పట్ల జనం ఒక్కసారిగా నవ్వారు. అయితే సైకిల్ గుర్తుకు ఓటేయాలని జోక్ చేసినట్లు తెలిపారు. అయితే అక్కడే ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు మాత్రం పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.