ట్విట్టర్ నివాసి పవన్ కళ్యాణ్ కళ్ళు తెరువు – భీమవరం ఎమ్మెల్యే!

Saturday, August 1st, 2020, 02:09:36 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయం లో చంద్రబాబు నాయుడు కి వంత పలికిన పవన్ కళ్యాణ్ అంటూ మరొకసారి వైసీపీ ఎమ్మెల్యే లు పవన్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం తో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి అని వైసీపీ పార్టీకి చెందిన, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. వికేంద్రకరణ, సి ఆర్ డి ఎ రద్దు బిల్లు లను అడ్డుకోవాలని చూసిన చంద్రబాబు కుట్రలకు సమాధి చేసిన శుభ దినం అంటూ వ్యాఖ్యానించారు.

అయితే రాజధాని ఎప్పటికీ మారదు మారదు అంటూ చంద్రబాబు కి వంత పలికిన పవన్ కళ్యాణ్ కి నేడు దుర్దినం అని విమర్శించారు. ప్రజలకు నేడు శుభదినం అంటూనే, ఇది ప్రజల కోరిక అని అన్నారు. మూడు రాజధానుల నిర్ణయం విజ్ఞుల ఆలోచన అని, అజ్ఞాతవాసి ట్విట్టర్ నివాసి పవన్ కళ్యాణ్ ఇకనైనా కళ్ళు తెరవాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు. అయితే గ్రంధి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ప్రసుత్తం హాట్ టాపిక్ అయ్యాయి.