ఆ విషయాన్ని నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తా – వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్

Sunday, April 18th, 2021, 10:12:15 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తిరుపతి ఉపఎన్నిక విషయం లో అధికార పార్టీ వైసీపీ పై ప్రతి పక్ష పార్టీ లు అయిన తెలుగు దేశం మరియు బీజేపీ లు వరుస విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ మేరకు వైసీపీ కి చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉపఎన్నిక లో పోలింగ్ శాతం పడిపోవడానికి తెలుగు దేశం పార్టీ నేతలే కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. క్యూ లో ఉన్నటువంటి ఓటర్లను కూడా టీడీపీ నేతలు భయ భ్రాంతులకి గురి చేశారు అంటూ ఆరోపించారు. అయితే దొంగ ఓట్లు అంటూ టీడీపీ మరియు బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తున్నాయి అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే తెలుగు దేశం పార్టీ వద్ద ఎప్పుడూ కూడా మూడు స్క్రిప్టులు రెడీ గా ఉంటాయి అని విమర్శించారు. అయితే పరిస్థితిని బట్టి వాటిని ప్రజల పై రుద్దడం వాళ్లకు అలవాటు గా మారింది అని వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల ప్రచారం లో మత్స్య కారులకు 43 కోట్ల రూపాయల ప్యాకేజి ఇచ్చామని లోకేష్ చెప్పారు, అయితే అదంతా నిజం కాదు అని అన్నారు. అయితే ఒకవేళ ఈ విషయాన్ని నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తా అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యవహారం పై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.