సాయినార్ ఘటన పై టీడీపీ శవ రాజకీయాలు చేయడం బాధాకరం – వైసీపీ ఎమ్మెల్యే!

Tuesday, June 30th, 2020, 01:00:20 PM IST

వైజాగ్ లో మరో గ్యాస్ లీకేజీ ఘటన పై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఘటన లో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. అయితే ఘటన జరిగిన వెంటనే కలెక్టర్ మరియు పోలీస్ అధికారులు సంఘటన స్థలికి చేరి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. అయితే ఈ ఘటన పై టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజు తప్పుబట్టారు. సాయి నార్ ఘటన పై తెలుగు దేశం పార్టీ శవ రాజకీయాలు చేయడం బాధాకరం గా ఉంది అని వ్యాఖ్యానించారు.

తెలుగు దేశం పార్టీ అధికారం లో ఉండగా, ఇదే కంపెనీ లో ముగ్గురు చనిపోయారు అని గుర్తు చేశారు. అపుడు ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని నిలదీశారు. అయితే ఈ సాయినార్ గ్యాస్ లీకేజీ ఘటన లో యాజమాన్య నిర్లక్ష్యం కనిపిస్తుంది అని వ్యాఖ్యానించారు. ప్రజలను ఇబ్బందులు పెట్టే ఎంత పెద్ద సంస్థ అయినా వదిలేది అని తేల్చి చెప్పారు. ఈ ఘటన పై ఇప్పటికే వైసీపీ నేత,ఎంపీ విజయ సాయి రెడ్డి ఆరా తీశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం ఆరా తీయడం జరిగింది. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అయితే వైజాగ్ లో జరిగిన పై ప్రభుత్వం త్వరితంగా స్పందించి బాధితులకు భారీ నష్ట పరిహారం సైతం అందించడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే.