రాజధానిని తరలిస్తాన్నామని ఎవరు చెప్పారు—వైసీపీ ఎమ్మెల్యే

Monday, January 13th, 2020, 11:30:03 PM IST

అమరావతి రాజధాని విషయం లో వైసీపీ ఎమ్మెల్యే అదీప్రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడు సొంత లాభం కోసం ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. చంద్రబాబు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. రైతులని మోసం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఫై అదీప్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ అయింది.

తన బినామీల భూముల రేట్లు తగ్గిపోతాయనే చంద్రబాబు ధర్నాలు చేస్తున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ తన స్వార్థం కోసం నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు బిక్ష దేనికోసం చేసారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు సతీమణి ఏం చేసారో చెప్పాలని డిమాండ్ చేసారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం ఏనాడూ జోలె పట్టని చంద్రబాబు ఇపుడు ఇలా చేయడం సిగ్గుచేటని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్దే జగన్ లక్ష్యమని అన్నారు. రెఫరెండం కావాలంటే విశాఖపట్నం నుండే మొదలుపెడదాం అని సంచలన వ్యాఖ్యలు చేసారు. విశాఖపట్నంలోని ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకి రావాలని చంద్రబాబు కి సవాల్ విసిరారు.