వైసీపీ ఎమ్మెల్యే కి తెల్ల రేషన్ కార్డు..ప్రభుత్వ వైఫల్యమే?

Tuesday, September 10th, 2019, 11:45:22 AM IST

ప్రభుత్వం తమకి నాణ్యమైన బియ్యాన్ని అందించిందని, గ్రామా వాలంటీర్లు స్వయంగా వచ్చి అందజేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే సిదిరి అప్పల్రాజు తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా తెలిపారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి పని తీరుని మెచ్చుకున్న వైసీపీ నేత, ఇక్కడే దొరికిపోయారంటూ పలువురు కామెంట్స్ రూపం లో వైసీపీ నేతను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి , తెల్ల రేషన్ కార్డు ఎలా వుంది అని, రేషన్ ఎలా తీసుకుంటున్నారు అంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

అయితే ఈ తెల్ల రేషన్ కార్డు పై వివరణ ఇస్తూ పలు వ్యాఖ్యలు చేసారు. గతం లో పాస్ పోర్ట్ కొరకు తాను రేషన్ కార్డు అప్లై చేసారని, గులాబీ కార్డు కి అప్లై చేసానని, ఈ క్రమంలో 2010-11 లో తెల్లకార్డు వచ్చిందని తెలిపారు. దాని తర్వాత రద్దు చేయమని కోరాను. 2014 లో రద్దు అయిందని తెలిపారు. కానీ మరల ఈ కార్డుల పునరుద్ధరణలో ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు అని అన్నారు. బియ్యాన్ని వెనక్కి ఇస్తూ ఈ విషయం పై అధికారులని విచారంచిమని కోరారు. అయితే ఈ విషయం లో వైసీపీ ఎమ్మెల్యే సిదిరి అప్పల్రాజు పలు కీలక వ్యాఖ్యలు చేసారు. రేషన్ నెల నెల తీసుకోకపోతే రేషన్ కార్డు ని రద్దు చేయాలి, కానీ చెయ్యలేదు, రేషన్ రాలేదు, దీనికి సంబందించిన పథకాలు నేను అందుకోలేదు, వీటన్నిటికీ కారణం ఏమిటి అని గత ప్రభుత్వాన్ని నిందిస్తున్నట్లుగా వ్యాఖ్యలు తెలిపారు.