బిగ్ బ్రేకింగ్: జనసేన నాయకుడు నానాజీ రెచ్చగొట్టడం వలనే—వైసీపీ ఎమ్మెల్యే

Tuesday, January 14th, 2020, 10:00:40 PM IST

జనసేన కార్యకర్తలు ఒక ప్లాన్ ప్రకారమే తనపై దాడి చేసారని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తన ఇంటిని ద్వంసం చేసేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అశాంతి కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంటే, రాజధాని పేరు చెప్పి రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

జనసేన పార్టీ నాయకుడు నానాజీ రెచ్చగొట్టడం తో కార్యకర్తలు తమ ఇంటిని ద్వంసం చేసేందుకు ప్రయత్నించారని అన్నారు. వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తల ఫై జనసేన కార్యకర్తలు దాడి చేసారని అన్నారు. పవన్ కళ్యాణ్ కి నానాజీ తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. నేతలను తప్పుదారి పట్టించే మనస్తత్వం నానాజీది అని, ఆ విషయం పవన్ గ్రహించాలని అన్నారు. దాడి ఫై పవన్ స్పందించిన తీరు సరికాదని, చంద్రబాబు, పవన్ బాష మార్చుకోవాలని, వారి బాష బాగుంటే తామంతా బాగుంటామని సంచలన వ్యాఖ్యలు చేసారు.