లాక్ డౌన్ కి ప్రజలందరూ సహకరించాలి – వైసీపీ ఎమ్మెల్యే

Sunday, March 22nd, 2020, 10:43:08 PM IST

వైసీపీ పార్టీ ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ, జగన్ పిలుపు మేరకు ప్రజలందరూ జనత కర్ఫ్యూ నీ విజయవంతం చేశారని అన్నారు. సాయంత్రం ఆరు గంటలకు పారిశుధ్య కార్మికులకు, వైద్యులకు, పోలీసులకు చప్పట్లతో అభినందనలు తెలపడం సంతోషకరం అని వ్యాఖ్యానించారు.

అయితే కరోనా వైరస్ నీ తరిమి కొట్టేందుకు పలు చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి అని, అత్యవసర పనులకు మాత్రమే బయటికి రావాలి అని వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన లాక్ డౌన్ కి ప్రజలందరూ సహకరించాలి అని తెలిపారు. విదేశాల నుండి వచ్చిన వారు స్వీయ నిర్భంధం లో ఉండాలని కోరారు.