బ్రేకింగ్: చంద్రబాబు పక్కన నేను కూడా దీక్ష చేస్తా– వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి

Wednesday, November 13th, 2019, 03:59:12 PM IST

టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు వైసీపీ నేతలు ఒక్కొక్కరు సమాధానం ఇస్తున్నారు. అయితే ఇసుక విషయంలో వైసీపీ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నది చంద్రబాబు, లోకేష్ అని తెలిపారు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు సాయంత్రం లోగా ఆధారాలు చూపించాలని, లేదంటే రేపు బాబు చేపట్టనున్న దీక్ష పక్కనే నేను కూడా దీక్ష చేస్తా అని ఎమ్మెల్యే పార్థసారధి హెచ్చరించారు. అంతేకాకుండా చంద్రబాబు పై పలు విమర్శలు గుప్పించారు.

ఎమ్మెల్యే పార్థసారధి చంద్రబాబు తీరుని దుయ్యబట్టారు. తన పై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, లేదంటే చంద్రబాబు పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. టీడీపీ విడుదల చేసిన ఛార్జ్ షీట్ పై ఆరోపణలు చేసారు. అందులో ఉన్నవన్నీ అబద్దాలే అని కొట్టి పారేశారు. బీసీ నేతలని టార్గెట్ చేసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన ఇసుక కంపుని ఇతరుల పై రుద్డేందుకే చంద్రబాబు చంద్రబాబు దీక్ష చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మార్వో వనజాక్షి ని అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్నందుకే దాడి చేసారని విమర్శించారు.