సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు – మల్లాది విష్ణు

Tuesday, April 20th, 2021, 07:31:22 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు వైసీపీ నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే విజయవాడ లోని సెంట్రల్ నియోజక వర్గంలో 50 మందికి 29,75,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. అయితే ఈ మేరకు మీడియా సమావేశం లో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ చూడం, మతం చూడం అనే నినాదం తో ముందుకు వెళ్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రతి పక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ పై పచ్చి అబద్ధాలు చెబుతున్నారు అంటూ విమర్శించారు. అయితే సెంట్రల్ నియోజక వర్గంలో 5 కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించాం అని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాక రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య శ్రీ అందుబాటులోకి తెచ్చాం అని మల్లాది విష్ణు తెలిపారు. అయితే ఆసుపత్రి ఖర్చు వెయ్యి రూపాయలు దాటిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నాం అని అన్నారు. అంతేకాక ఆరోగ్య శ్రీ కి సంబందించిన బకాయిలు లేకుండా చూస్తున్నాం అని అన్నారు. అయితే నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆసుపత్రుల్లో అభివృద్ది పనులు చేస్తున్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు.