పని పాట లేని లోకేష్ పబ్జీ ఆడుకుంటున్నాడు!

Sunday, June 28th, 2020, 03:17:17 PM IST

నారా లోకేష్, చంద్రబాబు లతో సహా టీడీపీ నేతల పై వైసీపీ ప్రజా ప్రతినిధులు ఘాటు విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వం పాలన లో చంద్రబాబు వైఖరి పై విరుచుకు పడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆదివారం నాడు తిరుపతి లో శ్రీవారిని దర్శించుకున్న వైసీపీ నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భౌతిక దూరం పాటిస్తూ శ్రీవారిని దర్శించుకున్న అని అన్నారు. జగన్ ఏడాది పాలనలో వంద శాతం పథకాలను అమలు చేశారని కొనియాడారు.

కరోనా వైరస్ ను అరికట్టడం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని వివరించారు. కరోనా వైరస్ టెస్టుల నిర్వహణ లో ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందుగా ఉంది అని, కరోనా ను ఆరోగ్య శ్రీ కిందకి తీసుకొచ్చింది అని, ఇతర రాష్ట్రాల లో లక్షల్లో ఖర్చు అవుతుంటే, జగన్ ఎంతోమంది ప్రాణాలు కాపాడారు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాష్ట్రం ను అప్పుల లో పడేసి వెళ్లారు అని, జగన్ మోహన్ రెడ్డి ఆర్దికంగా ప్రజలను ఆదుకుంటన్నారు అని వ్యాఖ్యానించారు.

అయితే నారా లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇష్టం వచ్చినట్లుగా నారా లోకేష్ మాట్లాడుతున్నారు, చంద్రబాబు 13 ఏళ్లు సీఎం గా ఉన్నారు అని, కరోనా లాంటి క్లిష్ట సమయంలో అండగా ఉండాల్సింది పోయి, హైదరాబాద్ కు పారిపోయారు అని, బాబు కి అవినీతి డబ్బు, అధికారం తప్ప, ప్రజల పై అభిమానం లేదు అని ఘాటు విమర్శలు చేశారు. పని పాట లేని లోకేష్ పబ్జి ఆడుకుంటున్నాడు అని అన్నారు. ఎమ్మెల్యే గా గెలవలేని లోకేష్ 151 సీట్ల భారీ మెజారిటీ తో గెలిచిన జగన్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు.