చంద్రబాబు నాయుడు తీర్మానాలు చూసి జనం నవ్వుకుంటున్నారు – ఎమ్మెల్యే రోజా!

Thursday, May 28th, 2020, 12:13:02 PM IST


మహానాడు లో ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రవేశ పెడుతున్న తీర్మానాలను చూసి జనాలు నవ్వుకుంటున్నారు అని నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ ఫోటో మి దండేసి, ప్రజాస్వామ్యం ప్రమాదం లో ఉంది అని అనడం సిగ్గు చేటు అని అన్నారు.అధికారం ఉన్నపుడే, నలుగురు ఎమ్మెల్యే లని కొని, మంత్రి పదవులు అప్పజెప్పారు అలాంటిది ప్రజాస్వామ్యాన్ని ఖుని చేసిన విషయాన్ని బాబు మర్చిపోయారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి, మహిళలకు, రైతులకు చేసిన మేలు ఏ ఒక్కరూ చేయలేదు అని అన్నారు.ముఖ్యమంత్రి చేసిన పనుల గురించి ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. అలానే 33 పథకాలు చంద్రబాబు ప్రవేశ పెడితే ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఎందుకు ఛి కొడతారు అని దిమ్మ తిరిగే ప్రశ్న వేశారు.ప్రజలు ఒక మూలన కూర్చోబెట్టిన చంద్రబాబు కి బుద్ది రాలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ మేనిఫెస్టో ను చిత్త శుద్ది తో అమలు చేస్తున్నారు అని, చంద్రబాబు మేనిఫెస్టో ను వెబ్ సైట్ నుండి తొలగించారు అని గుర్తు చేశారు.