పవన్ కళ్యాణ్ పై సంచలన వాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే – మరీ అంత దారుణమా…?

Tuesday, February 18th, 2020, 03:00:04 AM IST

రాష్ట్ర రాజకీయాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ పై అధికార పార్టీ ఎమ్మెల్యే కొన్ని సంచలనమైన వాఖ్యలు చేస్తూ,, తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే గత కొంత కాలం నుండి అధికార వైసీపీ పార్టీ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. కాగా పవన్ చేస్తున్నటువంటి వాఖ్యలపై రివర్స్ లో కూడా చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అయితే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ… పీకే అంటే అందరికి పవన్ కళ్యాణ్ కావచ్చు అని, కానీ నాకు మాత్రం తాజాగా పీకే అంటే పిచ్చికుక్క అని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు.

కాగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఐటీ దాడులపై వస్తున్న రాజకీయ విమర్శలపై మాట్లాడుతూ పలువురు టీడీపీ నేతలని, పవన్ కళ్యాణ్ పై మండిపడుతున్నారు. కాగా బుద్ధిలేని లొల్లి వెంకన్న.. మెదడులేని మేధావి యనమల రామకృష్ణుడు.. అచ్చోసిన ఆంబోతు లాంటి అచ్చెన్నాయుడు, బొంకలేక బొంకే బొచ్చయ్య చౌదరి, సొల్లు దేవినేని ఉమ, లోకజ్ఞానం లేని లోకేష్ అంటూ వ్యాఖ్యానించారు. వీరందరూ కూడా ప్రజలకు తలనొప్పిగా తయారయ్యారని, వీరు రాజకీయాలకు పనికి రారని ఆరోపించారు.