టీడీపీ నాటకాలకు బాగా పనికొస్తుంది – వైసీపీ ఎమ్మెల్యే

Tuesday, September 10th, 2019, 10:41:43 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకు పెను మార్పులు వస్తున్నాయి… అధికార ప్రతిపక్ష పార్టీల్లో మాటల యుద్దాలు చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుండి కూడా ఏపీలో వైసీపీ నేతల దాడులు ఎక్కువవుతున్నాయని, దానీ వలన టీడీపీ కార్యకర్తలు చాలా తీవ్రస్థాయిలో నష్టపోతున్నారని, అంతేకాకుండా కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని టీడీపీ నేతలు గత కొంత కాలంగా ఆరోపణలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా అయితే ఆ టీడీపీ నేతల వాఖ్యాలను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు, టీడీపీ నేతలు కావాలంటే కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తున్నారని, అసలు ఏపీలో ఇంతవరకు కూడా అలంటి దాడులే జరగలేదని అంటున్నారు. దానికితోడు ప్రజలను మభ్యపెటెందుకు కొత్తగా చలో ఆత్మకూరు అంటూ కొత్తగా నాటకాలుఆడుతుందని అంటున్నారు వైసీపీ నేతలు.

కాగా టీడీపీ నేతలు కొత్తగా శిబిరాల పేరుతొ నాటకాలను సృష్టిస్తుందని, అంతేకాకుండా వైసీపీ నేతల దాడుల పేరుతొ నాటకాలు ఆడుతుందని, ఆరోపిస్తున్నారు. ఈ టీడీపీ నేతలందరూ కూడా రాజకీయాల కంటే నాటకాలకు బాగా పనికొస్తారని, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు వారందరికీ కూడా సరైన శిక్షణ ఇస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పలు విమర్శలు చేశారు. కాగా గతంలో అధికారంలో ఉన్నపుడు జరిగిన అవినీతి కేసులపై ద్రుష్టి మరల్చడానికే చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీస్తున్నారని, ప్రజలందరినీ కూడా పనిగట్టుకొని మరి మోసం చేసేందుకే ఈ ప్రణాళికలు అని అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి .