అధికారులపై బెదిరింపులకు దిగుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే…

Wednesday, February 19th, 2020, 03:00:03 AM IST

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలపై, కార్యకర్తలపై అనవసర దాడులకు పాల్పడుతుందని ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ లన్ని కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతికరంగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే నిజం అని నిరూపించేలాగా అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా తమ నేతలకు, కార్యకర్తలకు సరైన గౌరవం ఇవ్వకపోతే మీ సంగతి చూస్తానని బెదిరిస్తున్నారు. అక్కడితో ఆగకుండా తమ నేతలకు తగిన గౌరవం ఇవ్వలేదని తన దృష్టికి వస్తే మాత్రం తన నుండి రెండో ప్రసన్న కుమార్ ని చూస్తానని హెచ్చరించారు.

కాగా ఇక్కడి అధికారులకు ఇష్టం లేకపోతె తమ మండలం నుండి వెళ్లిపోవచ్చునని, తమ అధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సరైన గౌరవం ఇవ్వకపోతే ఈ నియోజక వర్గంలో ఎందుకు ఉండాలని, మీ అందరికి కూడా ఇదే చివరి హెచ్చరిక అని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి హెచ్చరించారు. అంతేకాకుండా ఇకనుండి ఎవరైనా తనకు ఫోన్ చేసి, అధికార పార్టీకి చెందిన నేతలు తమని అవమానపరిచారని ఎవరైనా చెబితే మాత్రం జరిగే దారుణాలకు ఎవరు బాద్యులు కారని వాఖ్యానించారు.