చంద్రబాబుని కావాలనే అవమానించారా?

Friday, July 12th, 2019, 10:05:01 AM IST

ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు ముగిసి అప్పుడే రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు కూడా పూర్తయ్యాయి.మొదటి సారి ఏర్పాటు చేసిన సమావేశ విషయాలు పక్కన పెడితే ఏ రెండవ సారి జరిగిన సమావేశాలు మాత్రం మంచి రసవత్తరంగా జరిగాయనే చెప్పాలి.అయితే ఈ సమావేశాల్లో మాత్రం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఒక పక్క పట్టరాని కోపంతో పాటుగా ఘోరమైన అవమానం జరిగిన పనయ్యింది.

చంద్రబాబు ఒక అంశం పై తన వెర్షన్ ను మాట్లాడుతుంటే అవతల పక్క ఉన్న అధికార పక్షం మొత్తం వైసీపీ 150 ఎమ్మెల్యేలు సహా ఆ పార్టీ అధినేత మరియు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కూడా ఎగతాళి చేస్తున్నట్టుగా నవ్వుతూనే ఉన్నారు.చంద్రబాబు మాట్లాడుతున్నంతసేపు వీరంతా నవ్వుతుండే సరికి అది చంద్రబాబుకు తీరని అవమానంలా అనిపించేసరికి చంద్రబాబు అక్కడే గట్టిగా గద్దించారు.కానీ వీరంతా అలా నవ్విన అంశం మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తునే చర్చకు దారి తీసింది.బాబు మాట్లాడుతుండగా జగన్ మరియు ఆయన బృందం కావాలనే ఆపకుండా నవ్వి అవమానించారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.