చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్!

Thursday, July 9th, 2020, 08:45:24 PM IST


విజయవాడ నగరం లో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు పై ఇప్పటికే టీడీపీ, వైసీపీ నేతల్లో విమర్శల పర్వం మొదలైంది. అయితే సీఎం జగన్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం గర్వకారణం అని వైసీపీ నేత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు. అంతేకాక ఈ విగ్రహం ఏర్పాటు పై టీడీపీ ప్రశ్నిస్తున్న తీరు ను ఖండిస్తున్నాం అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం హయం లో ఈ విగ్రహం ఏర్పాటు పూర్తి కాలేదు అని, కనీసం ఇపుడు అయినా చంద్రబాబు నాయుడు సంతోష పడాలి అని డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు.

అయితే చంద్రబాబు అంబేడ్కర్ విగ్రహానికి శంకుస్థాపన మాత్రమే చేశారు అని, అంబేడ్కర్ డమ్మీ విగ్రహాన్ని రాజధాని లో ఏర్పాటు చేశారు అని, కానీ అందుకు సంబంధించిన ఎలాంటి పనులు ఇంకా జరగలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశం లో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల విగ్రహ ఏర్పాటు కు సీఎం జగన్ మోహన్ రెడ్డి పూనుకున్నారు అని, అందుకు ధన్యవాదాలు తెలిపారు. అంబేడ్కర్ ఒక కులానికి, మతానికి చెందిన వ్యక్తి కాదు అని, దేశం మెచ్చిన వ్యక్తి అని వ్యాఖ్యానించారు.