పక్క రాష్ట్రంలో దాక్కొని చంద్రబాబు అలా చేయడం సిగ్గుచేటు – వైసీపీ ఎంపీ

Thursday, May 21st, 2020, 09:45:29 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గ ప్రసాద్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి తో కలిసి జీవించేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు నాయుడు కరోనా వైరస్ కి భయపడి హైదరాబాద్ లో దాక్కున్నారు అని వ్యాఖ్యానించారు. అంతేకాక అక్కడ ఉండి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు అని అన్నారు. అలా చంద్రబాబు విమర్శించే అర్హత లేదు అని అన్నారు.

అయితే నాడు నేడు లో జరిగిన కార్యక్రమంలో దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు. దాని పైకీలక వ్యాఖ్యలు వెలువరించారు. అంతేకాక కరోనా వైరస్ మహమ్మారి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ను కేంద్ర ప్రభుత్వం కొనియాడుతూ ఉంది అని అన్నారు. అయితే చంద్రబాబు మాత్రం హైదరాబాద్ లో ఉంది తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.అయితే ఈ వైరస్ కట్టడికి వైసీపీ నేతలు చేసిన విరాళం గురించి వివరించారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వలన నాడు నేడు కార్యక్రమం చరిత్ర లో నిలుస్తుంది అని వ్యాఖ్యానించారు.