వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు క్లారిటీ – సీఎం ఏమంటారో మరి…?

Wednesday, November 20th, 2019, 02:00:53 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అనే అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఇకపోతే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు అన్ని కూడా తప్పు బడుతున్నాయి. కానీ సీఎం జగన్ కి మద్దతుగా ఉండాల్సిన వైసీపీ ఎంపీ కూడా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అందుకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పై కొన్ని విమర్శలు కూడా చేశారు. ఈమేరకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపోతే ఈ మేరకు ఎంపీ కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు. అయితే తాను లోక్ సభలో ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను తెలుగు అకాడమీకి రావాల్సిన నిధుల కోసమే మాట్లాడానని, అసలు ఇంగ్లీష్ అనే పదాన్ని ఎక్కడ కూడా వాడలేదని వివరించారు. ఇకపోతే తెలుగు బాష అంటే తనకు చాలా ఇష్టమని, అవసరమనుకుంటే పార్టీ కి సంజాయిషీ కూడా అడుగుతానని వైసీపీ ఎంపీ స్పష్టం చేశారు.