వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ప్రతి పక్ష నేత చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరల స్థిరీకరణ నిధి నీ హయాంలో లేదు అని విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తివి ఇప్పుడు వాటి గురించి మాట్లాడటానికి సిగ్గనిపించడం లేదా బాబూ? అంటూ ఘాటు గా ప్రశ్నించారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని సిఎం జగన్ గారు హామీ ఇచ్చారు అని అన్నారు. పంట కోతలు యదావిధిగా జరగాలని, రైతు నష్టపోకుండా చూసే పూచీ ప్రభుత్వానిది అని వ్యాఖ్యానించారు.
అయితే 14 ఏళ్లు సిఎంగా ఉండి నువ్వు కట్టించిన కోల్డ్ స్టోరేజి కేంద్రాలెన్నీ చంద్రబాబూ అంటూ ప్రశ్నించారు. రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నావు, రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు ఎవరూ ఆకలితో బాధపడే పరిస్థితి లేదు అని వ్యాఖ్యానించారు. కరువు జాడ నీతోనే పోయింది అని, ఇంకెప్పుడూ రావద్దని ప్రజలు కోరుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే ఈ నేపధ్యంలో హుదూద్, తిత్లీ తుఫాన్లను డీల్ చేశా అని కటింగులిస్తున్నాడు అని చంద్రబాబుని ఎద్దేవా చేశారు. తుఫాను పోయిన నాలుగు రోజుల తర్వాత కూడా మంచినీళ్లు అందించలేని పాలన నీది అని, వందల ట్యాంకర్లు సరఫరా చేసినట్టు బిల్లులు మింగారు అని, శ్రీకాకుళంలో బస్సు వద్దకు బాధితులు వచ్చి నిలదీస్తే, ఏయ్ మీదే వూరని గద్దించింది నువు కాదా అంటూ ఘాటు విమర్శలు చేశారు. అయితే వైసీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు పై నెటిజన్లు స్పందిస్తున్నారు. కరోనా వైరస్ ఈ సమయంలో ఇంతలా వ్యాప్తి చెందుతుంది, వైసీపీ ఎంపీ ఇలా స్పందిస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ధరల స్థిరీకరణ నిధి నీ హయాంలో లేదు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తివి ఇప్పుడు వాటి గురించి మాట్లాడటానికి సిగ్గనిపించడం లేదా బాబూ? ప్రతి గింజ కొనుగోలు చేస్తామని సిఎం జగన్ గారు హామీ ఇచ్చారు. పంట కోతలు యదావిధిగా జరగాలని ఆదేశించారు. రైతు నష్టపోకుండా చూసే పూచీ ప్రభుత్వానిది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 1, 2020
హుదూద్, తిత్లీ తుఫాన్లను డీల్ చేశా అని కటింగులిస్తున్నాడు. తుఫాను పోయిన నాలుగు రోజుల తర్వాత కూడా మంచినీళ్లు అందించలేని పాలన నీది. వందల ట్యాంకర్లు సరఫరా చేసినట్టు బిల్లులు మింగారు. శ్రీకాకుళంలో బస్సు వద్దకు బాధితులు వచ్చి నిలదీస్తే, ఏయ్ మీదే వూరని గద్దించింది నువు కాదా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 1, 2020