బిగ్ న్యూస్ : జగన్, విజయసాయి రెడ్డిలపై వైసీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్.!

Saturday, June 27th, 2020, 04:24:49 PM IST

గత కొన్ని రోజుల నుంచి ఏపీ అధికార పార్టీ వైసీకు చెందిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు చేసిన పలు కామెంట్స్ ఆ పార్టీలో ఓ రేంజ్ లో హీట్ పుట్టించాయి. దీనితో పార్టీ నేతలు మరియు కార్యకర్తల్లో అతనిపై పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి.

ఇదిలా ఉండగా రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ తరపున షోకాజ్ నోటీసులు పంపగా దానికి దిమ్మతిరిగిపోయే రిప్లై ను తిరిగి ఇచ్చారు. పైగా ఇప్పుడు ఢిల్లీ వెళ్లగా ఆయన వ్యవహారం మరింత రంజుగా మారింది. అయితే అక్కడ నుంచి ఇచ్చిన ప్రెస్ మీట్ లో రఘురామ కృష్ణంరాజు పలు షాకింగ్ కామెంట్స్ చేసారు.

తాను ఎప్పుడు జగన్ పై విమర్శలు చెయ్యలేదని అసలు చెయ్యబోను కూడా అని తెలిపారు. కానీ నేను అలా చేసినట్టుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తమ సామాజిక సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి చిత్రీకరించారని షాకింగ్ కామెంట్స్ చేసారు. నేను ఎప్పుడు జగన్ కు వ్యతిరేఖం కాదని అలా నన్ను చిత్రీకరిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.